![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -231 లో...... గుడికి గంగ, రుద్ర, రంగా ముగ్గురు వచ్చి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత పెద్దసారు కుటుంబంతో ఎంట్రీ ఇస్తాడు. శకుంతల కోపంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావ్.. నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావా అని పెద్దసారు అనగానే ఏంటండీ ఆ మాటలు అని శకుంతల అంటుంది. పెద్దనాన్న ఆ మాటలు అనడం తప్పు.. ముందు పెద్దమ్మకి సారీ చెప్పు అని స్నేహ అనగానే సరే అని పెద్దసారు సారీ చెప్తాడు. దాంతో శకుంతల నవ్వుతుంది.
ఆ తర్వాత తలంబ్రాలు తీసుకొని రమ్మంటే ఇవి తెచ్చారేంటి.. అయినా మీకు పెళ్లి గురించి ఏం తెలుసు.. ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు మెడలో తాళి కట్టి బాక్సింగ్ కి తీసుకొని వెళ్లారని రుద్రతో అనగానే అనగానే అయితే ఇప్పుడు మీకు మళ్ళీ పెళ్లి చేయమంటారా అని పెద్దసారు అడుగుతాడు. ఈ తింగరిదాన్ని ఒక్కసారి చేసుకునే భరించలేకపోతున్నాను.. ఇప్పుడు మళ్ళీ అంటే నాతో అవ్వదని రుద్ర అనగానే అందరు నవ్వుకుంటారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఎవరు ఇతను అని పెద్దసారు అడుగగా సేల్స్ మేనేజర్ అని రుద్ర చెప్తాడు. ఎక్కడో చూసానని ఇషిక అనగానే..... ఇందుమతి గారు మీకు మనవడు కావాలంటే గుళ్లో ఇరవై ఒక్క ప్రధాక్షనలు మీ కోడలు చెయ్యాలని రంగా అనగానే ఇషిక పదా అని తనని ఇందుమతి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత పంతులు రాముడి గొప్పతనం గురించి అందరికి వివరిస్తాడు.
వీరు మనుషులు పెద్దసారుని చంపాలని ట్రై చేస్తుంటే రుద్ర అడుగడుగునా అడ్డుకుంటాడు. ఆ తర్వాత ప్రమీలని చూసి కొంతమంది ఆడవాళ్లు తిడతారు. అప్పుడే కార్తీక్ వచ్చి మీరు మనుషులేనా అంటూ వాళ్ళపై కోప్పడి ప్రమీలకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత రౌడీలకి వీరు ఫోన్ చేసి మాట్లాడతాడు. తరువాయి భాగం లో వీరునే రంగంలోకి దిగి పెద్దసారుని షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |